ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు.. ఇలా చేతినిండా ఆఫర్లతో బిజిబిజీగా మారిపోయింది స్టార్ యాంకర్. తన అందం, చలాకీతనంతో బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో వరుసగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతూ తెగ సందడి చేస్తున్నారు. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ‘నేను ఓ డిజాస్టర్‌తో బాధ పడుతున్నా.. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను. వారి గురించి పట్టించుకోవకపోవడమే నా రుగ్మత’ అంటూ అసలు విషయం బయటపెట్టింది అనసూయ. కాగా పలుమార్లు తన సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ట్రోలింగ్ బారిన పడింది అనసూయ. ఈ నేపథ్యంలోనే తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ట్రోల్ చేసినా తాను లెక్కచేయనంటూ, తనకు తోచించే చేస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది అనసూయ
కాగా రంగమ్మత్తతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. పుష్పలో ద్రాక్షాయణిగా మెప్పించిన ఆమె చేతిలో ప్రస్తుతం పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా తెరెకెక్కిస్తోన్న కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటిస్తోందట. ఇందులో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..