Anchor Anasuya: అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్

 జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఆమె తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో మరణించారు.

Anchor Anasuya: అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్
Anchor Anasuya

Updated on: Dec 05, 2021 | 1:14 PM

జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఆమె తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.  63 ఏళ్ల సుదర్శన్ రావు కొంతకాలం నుంచి క్యాన్సర్​తో పోరాడుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన సుదర్శన్ రావు.. కొద్ది నిమిషాల్లోనే మరణించినట్లు తెలుస్తోంది.  దీంతో అనసూయ కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుదర్శన్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అలాగే సోషల్ యాక్టివిటీస్‌లో ఆయన పేరు ప్రముఖంగా వినపడేది.  తండ్రి మరణంతో… యాంకర్ అనసూయ తీవ్రంగా దుఃఖిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు అనసూయ ఇంటికి చేరుకుంటున్నారు. నాగబాబు, రోజా కూడా అనసూయకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది.

 

స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తన తండ్రి మరీ మరీ చెప్పేవారని గతంలో అనసూయ తెలిపింది. బయట జనంలో ఎలా మాట్లాడుతున్నాం అని దూరం నుంచి ఆయన ఓ కంట కనిపెడుతుండేవారని వివరించింది. తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని చాలాసార్లు చెప్పింది. అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్‌ని ప్రేమించి… పెద్దలను ఒప్పించి పెళ్లాడింది. సుశాంత్‌‌ను మ్యారేజ్ చేసుకోవడానికి అనసూయ తండ్రి సుదర్శన్ రావు ససేమిరా ఒప్పుకోలేదు. ఆయన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి అనసూయకు 9 సంవత్సరాల సమయం పట్టిందట.

Also Read: Telangana: చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు