Anasuya Bharadwaj: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ.. అసలేం జరిగిందంటే

|

Apr 15, 2023 | 6:40 AM

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ క్రేజ్ ను అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ.

Anasuya Bharadwaj: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ.. అసలేం జరిగిందంటే
Anasuya Bharadwaj
Follow us on

అందాల భామ అనసూయ తెలియని తెలుగు వారు ఉండరేమో.. బుల్లితెర యాంకర్ గా రాణించిన అనసూయ.. ఎన్నో టీవీ షోల్లో తన యాంకరింగ్ తో కట్టిపడేసింది. ముఖ్యంగా జబర్ధస్ ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ క్రేజ్ ను అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన పై విమర్శలు చేసే వారికి తన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. తనను ట్రోల్ చేసే నెటిజన్స్ కు సోషల్ మీడియా వేదికగా వార్ నింగ్ లు కూడా ఇస్తూ ఉంటారు అనసూయ.

తగ ఈ అమ్మడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో సిబ్బంది తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ  ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇండిగోను తాను ద్వేషిస్తున్నట్టు  ఆమె పేర్కొంది.

నేను ఎయిర్‌లైన్స్‌ను ద్వేషిస్తున్నాను..ఇక్కడ దేశీయ ఎయిర్‌లైన్స్‌లో వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం..అస్సలు నాణ్యతలేని సేవలు అంటూ అనసూయ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అయితే అనసూయకు జరిగిన అసౌకర్యం ఏంటి అన్నది మరి ఆమె పేర్కొనలేదు. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి దీని పై ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తుందేమో చూడాలి.