మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తన ఆలోచనలు తెలియజేస్తుంటాడు. ఇక వైరల్ వీడియోస్.. న్యూస్ పై కూడా ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అవుతుంటారు. ఇక ఆయన చేసే పోస్ట్స్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి దేశవిదేశాల వరకు తన వరకు వచ్చిన ప్రతి చిన్న అంశంపై ఆనంద్ మహీంద్రా తన ఆలోచనను తెలియజేస్తారు. తాజాగా ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇటీవల ప్రాజెక్ట్ కే సినిమా గురించి సాంకేతిక విభాగం ఓ తెలివైన ఇంజనీర్.. కార్లను ఉత్పత్తి చేయడంలో దిట్ట అయిన వ్యక్తి కావాలి. దానికి మీ సాయం కావాలంటూ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
నాగ్ అశ్విన్ ట్వీట్‌కు అనంద్ మహీంద్రా కూడా బదులిచ్చారు. తన కంపెనీలోని హెడ్‌ను పరిచయం చేశాడు. అంతేకాకుండా.. తన టీంను కలిస్తే వారు అన్ని విధాలుగా సాయం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇటీవల నాగ్ అశ్విన్ ఆనంద్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించాడు.. అక్కడి వాతావరణాన్ని చూసి ముగ్దుడయ్యాడు. దీంతో వెంటనే ట్విట్టర్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ అద్భుతంగా ఉందని.. ప్రకృతితో మమేకమైనట్టు ఉందని.. వేలు మహీంద్ర, అతని బృందంతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్‌కు థ్యాంక్స్ అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందించాడు. నిజం చెప్పాలంటే.. నువ్వే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి.. ఈ సైఫ్ మూవీ ప్టల ఎంతో ఆత్రుతను పెంచారు. నువ్ హాలీవుడ్‌ను బీట్ చేయబోతోన్నావ్ అని నాకు అర్థమవుతోందన్నట్టుగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Well @nagashwin7 I have to admit you have got me as excited now about this blockbuster sci fi film you’re creating. I have a hunch you’re going to beat Hollywood hollow… https://t.co/XiqyaEBIDr
— anand mahindra (@anandmahindra) March 13, 2022
Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..
Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..
Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..