Mahesh Babu’s Mother Death: ”అమ్మ అంటే నాకు దైవంతో సమానం”.. తల్లి గురించి మహేష్ మాటల్లో..

| Edited By: Rajitha Chanti

Sep 28, 2022 | 2:46 PM

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం ఘట్టమనేని కుటుంబసభ్యుల్లో.. అభిమానుల్లో విషాదాన్ని నింపింది. కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Mahesh Babus Mother Death: అమ్మ అంటే నాకు దైవంతో సమానం..  తల్లి గురించి మహేష్ మాటల్లో..
Mahesh Babu's Mother Indira
Follow us on

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం ఘట్టమనేని కుటుంబసభ్యుల్లో.. అభిమానుల్లో విషాదాన్ని నింపింది. కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో..ఈరోజు తెల్లవారుజామున 4గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. అమ్మ అంటే మహేష్ కు ఎనలేని మమకారం. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో .. సక్సెస్ మీట్స్ లో.. సోషల్ మీడియాలో ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి అమ్మ గురించి గొప్పగా చెప్పి మురిసిపోతుంటారు మహేష్.

ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్‌. ఇటీవలే అన్నను కూడా పోగొట్టుకున్నారు మహేష్. మహేష్ బాబు అన్న, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు 8 జనవరి అనారోగ్యంతో కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు కన్నుమూయడం మహేష్ ను ఎంతో బాధించింది. అదే సమయంలో మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన చివరి చూపుకు నోచుకోలేకపోయారు. ఇప్పుడు తల్లి మరణంతో మరింత కృంగిపోయారు మహేష్.

తాజాగా మహేష్ బాబు తన తల్లి గురించి చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహర్షి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ మాట్లాడుతూ.. నాకు అమ్మంటే దేవుడుతో సమానం.. నా సినిమా రిలీజ్ ముందు కాఫీ తాగితే గుడిలో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది అంటూ మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.