
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. గతేడాది అక్టోబర్ 31వ తేదీన ఈ జంట నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు శిరీష్- నయనిక. ఇక వీరి వివాహం మార్చి ఆరో తేదీన జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ఘనంగాజ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి నెల రోజులకు ముందే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెప్పనున్న అల్లు శిరీష్ తన ఫ్రెండ్స్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులతో పాటు శిరీష్ కు కాబోయే భార్య నయనిక, అలాగే పలువరు స్నేహితులు, సన్నిహితులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
తాజాగా తమ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించి మరో వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు అల్లు శిరీష్. అందులో కాబోయే వధూవరులు, అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా అందరూ డ్యాన్స్ లు చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ తనకు కాబోయే భార్య నయనికకు ముద్దులు పెడుతూ తన ప్రేమను చాటుకున్నాడు. ‘ దుబాయ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్వీట్ మెమోరీస్’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు అల్లు వారి హీరో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
#Sophiechoudry seen celebrating the pre wedding of #AlluSirish along with #AlluArjun.#Celebs pic.twitter.com/weEL79Xqhu
— Filmfare (@filmfare) February 4, 2026
#AlluSirish pre-wedding chaos in Dubai 🎉 pic.twitter.com/CblYfQkkIr
— The Cine Gossips (@TheCineGossips) January 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.