Allu Arjun: కూతురితో కలిసి అల్లరి చేసిన స్నేహ రెడ్డి.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

|

Jun 07, 2024 | 9:20 AM

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఊర మాస్ లుక్ లో ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు బన్నీ. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్.

Allu Arjun: కూతురితో కలిసి అల్లరి చేసిన స్నేహ రెడ్డి.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
Allu Sneha Reddy
Follow us on

అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఊర మాస్ లుక్ లో ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు బన్నీ. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రెగ్యులర్ గా తన పిల్లల వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రెగ్యులర్ గా తన ఫ్యామిలీ బ్యూటీఫుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా స్నేహారెడ్డి షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తాజాగా వైరల్ అవుతున్న స్నేహ రెడ్డి వీడియోలో కూతురితో కలిసి అల్లరి చేశారు. కూతురు అర్హతో కలిసి బబుల్ గేమ్ తింటూ.. దాన్ని బెలూన్ గా ఊదుతున్న వీడియోను షేర్ చేశారు స్నేహారెడ్డి. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసే అల్లరి బన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అర్హ సినిమాల్లోనూ నటించింది. సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాలో అర్హ నటించింది.

స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.