Pushpa In OTT: అల్లు అర్జున్(Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప: ది రైజ్’ (Pushpa ).. బాక్సాఫీస్ లెక్కలు మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా మరో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా తీర్చిదిద్దిన ఈ సినిమా విడుదలైన అన్నీ భాషల్లో విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఊర మాస్ లుక్‌లో సందడి చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంగా సాగిన ఈ చిత్రంలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ పోషించింది.
అతి తక్కువ సమయంలోనే రూ. 300 కోట్ల ట్రేడ్ మార్క్‌ను దాటేసిన ఈ సినిమా.. థియేటర్లలో తనసత్తా చాటింది. అయితే తాజాగా పుష్ప సినిమా ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది. జనవరి 7న అంటే శుక్రవారం రాత్రి 8 నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేవలం సౌత్ లాంగ్వేజ్ ల కోసం రూ.22 కోట్లు చెల్లించిందని టాక్ నడుస్తోంది. ఇక హిందీ రైట్స్ కోసం రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ‘పుష్ప’రాజ్ కోసం అమెజాన్ ప్రైమ్ రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb! ?
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs— amazon prime video IN (@PrimeVideoIN) January 5, 2022
Also Read: Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా.. డబుల్ మాస్క్ ధరించాలంటూ..
Seerat Kapoor: బక్కిచిక్కిపోయిన బుజ్జిమా.. ఎందుకిలా తయారయ్యావంటూ ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..