అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి అందరికి తెలిసిందే. ఈ చిన్నారి తన క్యూట్ లుక్స్ తో అల్లరితో ఆకట్టుకుంటూ ఉంటుంది. కూతురితో కలిసి అల్లు అర్జున్ కూడా సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఇటీవల అర్హ శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అర్హ చేసే అల్లరి పనులతో పాటు. క్యూట్ వీడియోలను, ఆ చిన్నదాని టాలెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు బన్నీ సతీమణి అల్లు స్నేహ.
తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీలో పెట్టిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో అర్హ యోగాసనం వేస్తుండగా అది చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.