Allu Arjun: ముద్దు ముద్దు మాటల అర్హ చిట్టి చిలకమ్మ పద్యం.. మురిసిపోయిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్

|

Sep 25, 2023 | 9:12 AM

రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాలో బన్నీ నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఊరమాస్ పాత్రలో అదరగొట్టారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి అందరికి తెలిసే ఉంటుంది.

Allu Arjun: ముద్దు ముద్దు మాటల అర్హ చిట్టి చిలకమ్మ పద్యం.. మురిసిపోయిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్
Allu Arha
Follow us on

అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవల్ హీరో.. ఆయన సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాలో బన్నీ నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఊరమాస్ పాత్రలో అదరగొట్టారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ చిన్నారి అల్లరి సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ముద్దుముద్దు మాటలతో అర్హ చేసే అల్లరికి బన్నీ ఎంతగానో మురిసిపోతుంటాడు.

అర్హ తో కలిసి అల్లరి చేసే వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అల్లు అర్జున్. తాజాగా బన్నీ మరోసారి అర్హతో కలిసి ఆటలాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఎప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

 అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

అల్లు స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.