సదరన్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీతో వచ్చి హిట్ అందుకున్నాడు. ఈ పొంగల్ బన్నికి బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే..మూవీ కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం తెలుగు స్టేట్స్‌లోనే కాదు..ఓవర్సీస్‌లోనూ బన్ని దుమ్ము దులుపుతున్నాడు. ‘అల వైకుంఠపురములో’ యూఎస్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. 3.52 మిలియన్ డాలర్ల వసూళ్లతో..నాన్ ‘బాహుబలి’ రికార్డును సాధించింది.
బాహుబలి సిరీస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ యూఎస్‌లో హయ్యిస్ట్ గ్రాసర్‌గా ఉంది. ‘అల వైకుంఠపురములో’ మూవీతో తన బావ రికార్డునే బద్దలుకొట్టాడు బన్ని. పూజా హెగ్డే హీరోయిన్ నటించిన ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకుడు. తమన్ అదిరిపోయే సంగీతం అందించగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి.
Its ALL TIME RECORD(non-bb) in USA for #AlaVaikunthapurramuloo ?♥ Thanks for such wide open armed reception & acceptance!! #NonBBIndustryHITAVPL@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil @Blueskycinemas pic.twitter.com/RcZSdaLXHW
— Haarika & Hassine Creations (@haarikahassine) February 2, 2020