బల్లెం వీరుడు నీరజ్ చోప్రా మళ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణపతకం గెల్చుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 88.17 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (87.82 మీటర్లు) గట్టి పోటీ ఇచ్చినా రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా నీరజ్ చోప్రా విజయంతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడింది. బల్లెం వీరుడి విజయం అద్భుతమంటూ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికైన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపాడు.
గతంలో నీరజ్ చోప్రాను కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. నీ విజయాన్ని చూసి దేశమంతా గర్వంతో పొంగిపోతోంది’ అని విషెస్ తెలిపాడు. కాగా కొన్ని నెలల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల వేడుకలో అల్లు అర్జున్, నీరజ్ చోప్రా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజమ్‌ను అనుకరించి ఆకట్టుకున్నాడు నీరజ్. దీనికి సంబంధించి ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2.. ది రూల్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగ జరుగుతోంది.
Congratulations to #NeerajChopra garu for winning Gold for the 1st time at the #WorldAthleticsChampionships. It’s a proud victory for India . Jai Hind 🇮🇳
— Allu Arjun (@alluarjun) August 28, 2023
allu arjun with neeraj chopra pushpa style#AlluArjun #Pushpa2 #RashmikaMandanna #NeerajChopra #film #katrinakaif #PhoneBhootTrailer #RamSetuTrailer #Adipurush3dteaser #RakulPreetSingh pic.twitter.com/fcoLz0sJoE
— Funter (@funter_funterr) October 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.