Allu Arjun: బాస్‌తో బన్నీ మీటింగ్‌.. ఈ అంశాలపై చర్చ

|

Dec 15, 2024 | 3:20 PM

మేనమామ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. కుటుంబంతో సహా అక్కడికి వెళ్లి.. ఇటీవల పరిణామాలపై చర్చించారు.

Allu Arjun: బాస్‌తో బన్నీ మీటింగ్‌.. ఈ అంశాలపై చర్చ
Allu Arjun Meet Chiranjeevi
Follow us on

ఇది మెగా మీటింగ్.. బాస్‌తో బన్నీ మీటింగ్‌.. మెగాస్టార్‌ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు అల్లు అర్జున్‌. స్వయంగా కారు డ్రైవ్‌ చేస్తూ కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అరెస్టైన బన్నీ శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం రోజంతా టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతల పరామర్శలతో బిజీగా ఉన్నారు. శనివారం మేనత్త సురేఖ వచ్చి అల్లు అర్జున్‌తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఇక ఆదివారం బన్నీయే మెగాస్టార్ ఇంటికి వెళ్లి.. మావయ్యని కలిసి తాజా పరిణామాలన్నింటిపైన మాట్లాడారు.  అల్లు అర్జున్… చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి పలు అంశాలపై మాట్లాడినట్లు తెలిసింది.

అరెస్ట్ అయినప్పటి నుంచి బన్నీకి మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్‌ లభించింది. కేసు నమోదైన రోజే బన్నీకి మద్దతుగా నిలిచారు చిరంజీవి. అల్లు అర్జున్‌ అరెస్ట్ అయిన తర్వాత హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తన షూటింద్ రద్దు చేసుకుని.. అల్లు అరవింద్‌ సహా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలనుకున్నా పోలీసులు వద్దని సూచించడంతో ఆగిపోయారు. దీంతో కృతజ్ఞతగా ఆదివారం బన్నీ స్వయంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.

కాగా పుష్ప-2 పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్ అవడంతో.. బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు చిరు. అయితే బన్నీ వెళ్లిన సమయంలో చరణ్ ఉపాసన దంపతులు పనులు నిమిత్తం ఇంట్లో లేరని తెలిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.