Allu Arjun: ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లువారబ్బాయి ఇమేజ్ దెబ్బతీసే కుట్ర.. వారి పనేనా..?

నార్త్‌లో అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతుండటంతో.. ఆయన స్టార్‌డమ్‌ను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ మొదలైంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో బ్రాండ్ మేనేజర్ కావేరీ బరువా.. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కండిషన్లు ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Allu Arjun: ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లువారబ్బాయి ఇమేజ్ దెబ్బతీసే కుట్ర.. వారి పనేనా..?
Allu Arjun

Updated on: Feb 11, 2026 | 1:54 PM

దక్షిణాది నుంచి ఎవరు ఎదుగుతున్నా వారిని దించడానికి రెడీగా ఉంటుంది బాలీవుడ్‌. నార్త్‌లో అల్లు అర్జున్‌ క్రేజ్ చూస్తే మతిపోతుంది. ఖాన్‌ల దూకుడిని తలదన్నేలా.. వారి కలెక్షన్లను చిత్తూ చేసేలా అల్లు అర్జున్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. పుష్ప కన్నా ముందే అల్లు అర్జున్‌ మానియా అండర్‌ కరెంట్‌గా ఉంది. అయితే పుష్ప తర్వాత ఐకాన్‌స్టార్‌గా ఓ రేంజ్‌కు ఎదిగారు అల్లు అర్జున్‌. తన స్టైల్, గ్రేస్‌తో సౌత్‌లో ఆర్మీని క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఇటీవలకాలంలో నార్త్‌లో సైతం విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా.. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో కొందరు స్టార్‌డమ్‌ను తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇటీవల కావేరీ బరువా అనే ఓ బ్రాండ్‌ మేనేజర్‌ అల్లు అర్జున్‌పై దుష్ప్రచారానికి దిగారు. ఓ పాడ్‌కాస్ట్‌లో అల్లుఅర్జున్‌ను కలవాలంటే 42 కండిషన్లు పెట్టారంటూ కామెంట్‌ చేశారు. ఆయనను కలవడమే కష్టం.. కలిస్తే 42 కండిషన్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ మేనేజర్లు ఇద్దరు ముగ్గురు ఉంటారని.. వారు పెద్ద లిస్టే ఇచ్చారని కావేరీ కామెంట్‌ చేశారు. అల్లు అర్జున్‌ కళ్లలో కళ్లు పెట్టి చూడొద్దని.. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వొద్దని, కనీసం మూడు అడుగుల దూరం పాటించాలని.. అడ్డగోలుగా సెల్ఫీలు అడగొద్దంటూ ఆమె కామెంట్‌ చేశారు. అయితే ఆమె పాడ్‌కాస్ట్‌లోని కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దీంతో అల్లు అర్జున్‌ టీమ్‌ వెంటనే స్పందించింది. జరుగుతున్నదంతా అబద్ధపు ప్రచారమే అని.. ఆయన్ని కలవడానికి అలాంటి కఠినమైన ప్రోటోకాల్ ఏం లేదంటూ అల్లు అర్జున్ టీం నుంచి అధికారికంగా లేఖ విడుదలైంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్లపై లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందంటూ వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు.

బన్నీ క్రేజ్ చూసి.. ఇతర ఇండస్ట్రీల నుంచే ఈ నెగిటివిటీ వస్తుందంటూ మండి పడుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్యే ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరపడంతో పాటు రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటుకు రూట్ మ్యాప్ రెడీ అయింది. ఈ సమయంలో ఇలాంటి న్యూస్ ఫ్యాన్స్‌ను డిస్టర్బ్ చేస్తుంది. మొత్తానికి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.