Allu Arjun: అభిమానికి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్.. బన్నీ ఐడియాకు ఇన్‏స్టా ఫాలోవర్స్ పెరగాల్సిందే..

ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. అంతేకాకుండా నిత్యం ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉండే బన్నీకి ఇన్ స్టాలో దాదాపు 23.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీ షేర్ చేసే ఒక్క పోస్ట్ కు లక్షల్లో లైక్స్, షేర్స్ వస్తుంటాయి. అలాంటి స్టార్ హీరో.. తన లేడీ అభిమానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఇన్ స్టా ఫాలోవర్స్ పెరిగేందుకు తనవంతు సాయం చేశాడు.

Allu Arjun: అభిమానికి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్.. బన్నీ ఐడియాకు ఇన్‏స్టా ఫాలోవర్స్ పెరగాల్సిందే..
Allu Arjun

Updated on: Dec 01, 2023 | 11:17 AM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో బన్నీ మేనరిజం.. యాక్టింగ్.. డాన్స్ స్టైల్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. అంతేకాకుండా నిత్యం ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉండే బన్నీకి ఇన్ స్టాలో దాదాపు 23.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీ షేర్ చేసే ఒక్క పోస్ట్ కు లక్షల్లో లైక్స్, షేర్స్ వస్తుంటాయి. అలాంటి స్టార్ హీరో.. తన లేడీ అభిమానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఇన్ స్టా ఫాలోవర్స్ పెరిగేందుకు తనవంతు సాయం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఓ లేడీ అభిమాని ముందు నిల్చున్న బన్నీ.. ‘నీకు బాగా ఫాలోవర్లు రావాలని మంచి వీడియో తీస్తాను. నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు’ అని అడగ్గా.. ఆ అమ్మాయి 13K ఉన్నారని తెలిపింది. మినిమం ఎంత టచ్ అవ్వాలి ? అని బన్నీ అడిగితే 30K అని ఆ అమ్మాయి చెప్పింది.. దీంతో ఈ వీడియోతో వస్తారా ?.. అని అన్నారు బన్నీ. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

ఈ వీడియోను ఆ అమ్మాయి తన ఇన్ స్టాలో షేర్ చేసిన నిమిషాల్లోనే తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు.. ఫాలోవర్స్ సైతం క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఆ అమ్మాయి ఇన్ స్టా ఫాలోవర్స్ ఏకంగా 26.8K  అయ్యారు. లేడీ అభిమానితో బన్నీ క్యూట్ గా మాట్లాడటం చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ట్విట్టర్ లోనూ షేర్ చేస్తున్నారు. గురువారం తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు బన్నీ. ఉదయాన్ని బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ లో తన ఓటు వేశాడు బన్నీ. అనంతరం ఈ వీడియో నెట్టింట్లో ప్రత్యేక్షమయ్యింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.