Allu Arjun’s Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన ఫోకస్ అంతా పుష్ప పైనే పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా హీరోయిన్‌గా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. పుష్పలో ఈ బ్యూటీ డీగ్లామర్‌గా కనిపించనుంది. ఇక పుష్ప సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ .
ఈ క్రమంలో తాజగా మరో పాటను చిత్రీకరిస్తున్నారు పుష్ప టీమ్. ఈపాటకు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చింది చిత్రయూనిట్. దీపావళి కానుకగా ఈ పాటకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తుంటే ఇది కూడా మాస్ సాంగ్ అని అర్ధమవుతుంది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ బుల్లెట్ పై కూర్చొని కనిపిస్తున్నాడు. అలాగే ఈ పాట కోసం ఏకంగా వేయిమంది డాన్సర్లు పని చేస్తున్నారని తెలిపారు చిత్రయూనిట్. అలాగే ఈ సినిమాలో సునీల్, అనసూయ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :