పాన్ ఇండియా హిట్స్ లిస్ట్ లో తెలుగు సినిమాలే టాప్.. వాటిలో ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప(Pushpa). సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి పాన్ ఇండియా సినిమాతోనే బన్నీ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరేమో.. పుష్పరాజ్ గా ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు బన్నీ. నటనలో డైలాగ్ డెలివరీలో, యాటిట్యూడ్ లో బన్నీ ఇరగదీశాడనే చెప్పాలి అందుకే పుష్ప సినిమా దేశాలు దాటి రీసౌండ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 కోసం మొత్తం సినిమా లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించాడు.
మొదటి భాగంలో కంటే రెండో భాగంలో అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఊహించని ట్వీట్స్ లు ఉంటాయని తెలుస్తోంది. ఈ మేరకు సుకుమార్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను రష్యాలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇటీవల ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేశారు. అయితే రష్యన్ భాషలో ఈ సినిమాకు సబ్ టైటిల్స్‌తో పర్ ప్రదర్శించారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలో డబ్ చేసి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..