Pushpa 2 Day 2 Collection: బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ మాస్ జాతర.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే

|

Dec 07, 2024 | 8:58 AM

పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అల్లుఅర్జున్ మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Pushpa 2 Day 2 Collection: బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ మాస్ జాతర.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే
Pushpa 2
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా ఎంతో బాక్సాఫీస్ కు చూపించారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదలైంది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా భారీగా రిలీజ్ అయ్యింది ఈ మూవీ. అల్లు అర్జున్ “పుష్ప 2: ది రూల్” రెండవ రోజుకూడా దూసుకుపోతుంది. తొలిరోజే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే వసూళ్లు కూడా భారీగానే రాబడుతుంది ఈ సినిమా. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 175కోట్లు వసూళ్లు సాధించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 294 కోట్లు వసూల్ చేసింది.

కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

ఇక ఇప్పుడు రెండో రోజుకు దేశ వ్యాప్తంగా రూ. 265 కోట్లకు చేరుకుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్‌ను దాటింది పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ఘనవిజయాన్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. పుష్ప 1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప2 మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

Tollywood : నా బాడీ నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. తెగేసి చెప్పిన టాలీవుడ్ సింగర్

పుష్ప 2లో అల్లు అర్జున్ మరోసారి తన నటవిశ్వరూపం చూపించారు. తన మ్యానరిజం, నటన, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు అల్లు అర్జున్. అలాగే రష్మిక మందన్న కూడా తన నటనతో ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. రెండో రోజే రూ. 400కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.