AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa The Rule: బాలీవుడ్ బడా హీరోలు కూడా సైడైపోవాల్సిందే.. షారుక్, సల్మాన్‌కు పోటీగా పుష్పరాజ్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్.

Pushpa The Rule: బాలీవుడ్ బడా హీరోలు కూడా సైడైపోవాల్సిందే.. షారుక్, సల్మాన్‌కు పోటీగా పుష్పరాజ్
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2022 | 9:56 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇప్పటికీ ఎదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో కనిపించి అలరించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా జీవించేశాడని చెప్పొచు. ఆయన నటన, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో హిందీలోనూ అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధించింది.

పుష్ప దెబ్బకు అక్కడ స్టార్ హీరోలు సైతం నోరెళ్లబెట్టారు. ఒక్కసారిగా సౌత్ హీరో సినిమా రికార్డులు తిరగరాయడంతో అక్కడి స్టార్ హీరోలకు దిమ్మతిరిగినంత పనైంది. పుష్ప పార్ట్ 1 సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నపటికీ పుష్ప 2 కోసమే అక్కడి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న టైగర్ 3 సినిమా.. అలాగే షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటితో పటు పుష్ప సినిమా కూడా అక్కడ మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. తాజాగా జరిగిన ఓ సర్వేలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ సినిమాల్లో పుష్ప2 కూడా చేరిపోయింది.  దాంతో సల్మాన్ , షారుక్  ఈ సినిమాకు పోటీగా తమ సినిమా క్లాష్ అవ్వకుండా ఉండేలా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. మొత్తంగా మన సినిమా దెబ్బకు బాలీవుడ్ బడా హీరోలు కూడా జాగ్రత్తపడాల్సి వచ్చింది.. అది పుష్ప క్రేజ్ అంటే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us