Pushpa : పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదే లే అంటూ .. అల్లు అర్జున్ ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పుష్ప టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇక ఈ సినిమా కోసం బన్నీ ఆర్మీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ గా బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పాన్ ఇండియా మూవీగా తెరక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇప్పుడు పుష్ప ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కుతున్నాయి. రెండు రోజుల క్రితం విడుదల ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యుట్యూబ్ లో నెంబర్ 1 ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ట్రైలర్ తెలుగులో 20 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే అని భాషల్లో కలిపి 30 మిలియన్ఇ కు పైగా వ్యూస్క ను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ హా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :