Pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప.. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా పుష్ప.. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతుంది. గంధపుచెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకీ మరింత జోష్తో రికార్డ్స్ కలెక్షన్స్ కురిపిస్తోంది.
తాజాగా పుష్ప సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా 35 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. 2021లో విడుదలైన ఏ తెలుగు సినిమాకు దక్కని రికార్డ్ ఇది. మొత్తానికి 2021 లో బన్నీ సినిమా అరుదైన రికార్డును దక్కించుకుంది. బన్ని వన్ మ్యాన్ షోతో పుష్ప సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . ఇక విడుదలకు ముందు ఉన్న అంచనాలను ఆదుకోవడంలో పుష్ప రాజ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రస్తుతం సుకుమార్ పార్ట్ 2 పై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఈ రెండో భాగం షూటింగ్ మొదలు కానుంది. ఇక పుష్ప సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :