Allu Arjun: ‘కబీ అప్నే కబీ సప్నే’ హిందీ టైటిల్‌తో బన్నీ.. మరోసారి ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్..
గతంలో విడుదలైన గ్లింప్స్ మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక గురువారం బన్నీ కొత్త పోస్టర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

చాలా రోజులుగా పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో విడుదలైన గ్లింప్స్ మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక గురువారం బన్నీ కొత్త పోస్టర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
కబీ అప్నే కబీ సప్నే అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వేదం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీతోపాటు మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత క్రిష్ దర్శకత్వంలో బన్నీ హిందీ టైటిల్ తో రాబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడూ స్టార్ట్ కాబోతుంది ?.. నటీనటులు, టెక్నికల్ టీమ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా విడుదలైన పోస్టర్ చూసి.. ఈసారి బన్నీ హిందీలోనే నేరుగా సినిమా చేయబోతున్నారంటున్నారు ఫ్యాన్స్. కబీ అప్నే కబీ సప్నే టైటిల్ తో అభిమానులతో మరింత క్యూరియాసిటిని కలిగించారు బన్నీ.
#alluarjun & Director #Krish upcoming collaboration.
Exciting details to be revealed soon!#KabhiApneKabhiSapnepic.twitter.com/rSiiav8WqK
— Filmy Bowl (@FilmyBowl) September 28, 2023
ఇక బన్నీ సినిమాల విషయాన్ని వస్తే… ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పుడు సడెన్‌గా క్రిష్ తో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు బన్నీ. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ నటనకుగానూ జాతీయ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




