Allu Arjun: బాబోయ్.. ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ అంత పెంచేశాడా..?

|

Mar 12, 2023 | 7:41 AM

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా బన్నీ రేంజ్ ను మరింత పెంచేసింది. ఈ సినిమాలో బన్నీ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది.

Allu Arjun: బాబోయ్.. ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ అంత పెంచేశాడా..?
Allu Arjun
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా బన్నీ రేంజ్ ను మరింత పెంచేసింది. ఈ సినిమాలో బన్నీ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ సెకండ్ పార్ట్ లో మరింత ట్విస్ట్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయట. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. కాబట్టి ఆయన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు బన్నీ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడని టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమా తర్వాత.. బన్నీ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. టీ సిరీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నడని టాక్. భారీ అంచనాలు.. అలాగే అదే రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 125 కోట్ల రూపాయలు అందుకోనున్నడని అంటున్నారు. అలాగే పుష్ప2 సినిమాకు 100 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.