Kalki 2898 AD: మాటలు రావడం లేదు.. అద్భుతమైన విజువల్ వండర్.. కల్కిపై అల్లు అర్జున్ రియాక్షన్..

|

Jun 30, 2024 | 9:15 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరెలెవల్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే సినిమా టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ కాగా.. తాజాగా కల్కి చిత్రయూనిట్ ను పొగడ్తలతో ముంచేత్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Kalki 2898 AD: మాటలు రావడం లేదు.. అద్భుతమైన విజువల్ వండర్.. కల్కిపై అల్లు అర్జున్ రియాక్షన్..
Allu Arjun, Kalki
Follow us on

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమాకు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరెలెవల్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే సినిమా టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ కాగా.. తాజాగా కల్కి చిత్రయూనిట్ ను పొగడ్తలతో ముంచేత్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

కల్కి చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సుధీర్ఘ నోట్ రాసుకొచ్చారు. “కల్కి మూవీ టీంకు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన అద్భుతం. ఇక అమితాబ్ బచ్చన్ గారి నటన గురించి మాటలు రావడం లేదు. కమల్ హాసన్, దీపికా, దిశా నటన గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. ఇంత రిస్క్ తీసుకుని భారీతయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్, వైజయంతి మూవీస కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రియుడుని ఆశ్చర్యానికి గురిచేశాడు నాగ్. మా తరానికి చెందిన దర్శకుడికి ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచవ్యాప్తంగా సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమానే కల్కి” అంటూ రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.