
పుష్ప 2 తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్న అల్లు అర్జున్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె అల్లు అర్జున్ సరసన నటించనుంది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే బన్నీ తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి థియేటర్లకు 2 లారీల పేపర్లు తీసుకెళ్లండి అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అల్లు అర్జున్ తెగ నచ్చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇండియన్ సినిమా పరిశ్రమలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా శివ. 1989లో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కినేని నాగార్జునను ఓ స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా శివ. అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి సంచలన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇలా ఎన్నో విశేషాలున్నఈ కల్ట్ క్లాసిక్ మూవీ 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 14న శివ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు.
‘మన ‘శివ’ సినిమా విడుదలై దాదాపు 36 ఏళ్లు అవుతోంది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమాల్లోనే ఎప్పటికీ నిలిచిపోయే మోస్ట్ ఐకానిక్ ఫిలిమ్స్ లో ఒకటి. ఈ ఒక్క మూవీ తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ, తెలుగు సినీ ఇండస్ట్రీ కోర్స్ పూర్తిగా మారిపోయింది. అలాంటి సినిమాని హై క్వాలిటీలో డాల్బీ అట్మాస్ సౌండ్ తో మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. మన క్లాసిక్ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయమిది. మనందరికీ ఇష్టమైన నాగార్జున గారి చిత్రమిది. అక్కినేని అభిమానుల్లారా, TFI బానిసల్లారా.. ఈసారి థియేటర్లకు 2 లారీల పేపర్లు తీసుకెళ్లండి’ అని వీడియోలో చెప్పుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
To all the Akkineni Fans & TFI Banisas, this one’s for you ❤️
Watch Icon Star @alluarjun share his thoughts on the Impact of SHIVA ❤️🔥pic.twitter.com/XYDdGsJ3Xz#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on November 14th, 2025 💥💥#50YearsOfAnnapurna #ANRLivesOn…
— Annapurna Studios (@AnnapurnaStdios) October 25, 2025
అల్లు అర్జున్ వీడియోకు హీరో నాగార్జున కూడా స్పందించారు. ‘డియర్ అల్లు అర్జున్.. రెండు లారీల థాంక్స్’ అని పోస్ట్ పెట్టారు. అలాగే అక్కినేని నాగ చైతన్య సైతం బన్నీకి థ్యాంక్స్ చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి