AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ట్యాలెంట్‌లో తండ్రికి తగ్గ తనయ.. అల్లు అర్జున్ కూతురు ఏం చేసిందో తెలిస్తే చప్పట్లు కొడతారు

అల్లు అర్జున్ కూతురిగానే కాకుండా ఇప్పటికే తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది అల్లు అర్హ. శాకుంతలం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్ ఇప్పుడు తన ట్యాలెంట్ తో అందరి మన్ననలు అందుకుంటోంది.

Allu Arjun: ట్యాలెంట్‌లో తండ్రికి తగ్గ తనయ.. అల్లు అర్జున్ కూతురు ఏం చేసిందో తెలిస్తే చప్పట్లు కొడతారు
Allu Arjun Family
Basha Shek
|

Updated on: Nov 10, 2025 | 6:55 PM

Share

అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను అందరూ తరచూ షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా అల్లు అర్హ, అయాన్ ల వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా అల్లు అర్హ ఫొటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్హకు సంబంధించి స్నేహా రెడ్డి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా అల్లు స్నేహా రెడ్డి చిన్నప్పటి నుంచే తన పిల్లలకు అన్ని కళలను నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన కూతురు అల్లు అర్హతో దగ్గరుండి మరీ కుమ్మరి పని చేయించింది. మట్టితో అందమైన దీపాలను తయారు చేయించింది. తల్లి సాయంతో అల్లు అర్హ కూడా ఎంతో చక్కగా మట్టి దీపాలను తయారుచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్ గారాల పట్టి ట్యాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ట్యాలెంట్ లో బన్నీకి తగ్గ కూతురే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ది గార్దియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవల్లో అత్యాధునిక హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మట్టి ప్రమిదలు తయారు చేసిన అల్లు అర్హ..

Allu Arjun Family 1

Allu Arjun Family

అల్లు శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ లో  అల్లు అర్హ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు