Pushpa Movie: డబ్బింగ్ షూరు చేసిన ‘పుష్ప’.. బన్నీని ఆ రోజున కలవండి అంటూ ట్వీట్.. ఫోటోస్ వైరల్..

|

Apr 06, 2021 | 7:31 PM

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరెకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో బన్నీ లారీ

Pushpa Movie: డబ్బింగ్ షూరు చేసిన పుష్ప.. బన్నీని ఆ రోజున కలవండి అంటూ ట్వీట్.. ఫోటోస్ వైరల్..
Pushpa Team
Follow us on

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరెకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

ఫ్యామిలీతో కలిసి నిన్నటి వరకు మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్.. మళ్లీ హైదరాబాద్‏కు చేరుకున్నాడు. పుష్ప డబ్బింగ్ పనులు స్టార్ట్ చేయడం కోసం అల్లు అర్జున్ సుకుమార్ ఆఫీస్‏కు చేరుకున్నాడు. ఏప్రిల్ 6న పుష్ప డబ్బింగ్ పనులకు సంబంధించిన పూజా కార్యక్రమాలలో పాల్గోన్నాడు బన్నీ. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‏తోపాటు, సుకుమార్, నిర్మాతలు పాల్గొని.. దేవుడి చిత్రపటం ముందు కొబ్బరి కాయలు కొట్టేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రయూనిట్. ఏప్రిల్ 7న సాయంత్రం ఆరు గంటల 12 నిమిషాలకు కలవండి అంటూ ట్వీట్ చేశారు. ఆ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్వీట్..

Also Read: Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..

‘జలజల జలపాతం’ సాంగ్ మేకింగ్ వీడియో.. రొమాన్స్‏ సీన్లలో ఒకరిని మించి ఒకరు.. చివరకు బేబమ్మను భయపెట్టేశారుగా..