Allu Arha: అచ్చ తెలుగులో డైలాగ్స్.. అద్భుతమైన నటనతో అదరగొట్టిన అల్లు అర్హ.. ‘శాకుంతలం’ సినిమాలో తనే హైలెట్ !..
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన అద్భుతమై ప్రేమకథా దృశ్యకావ్యం శాకుంతలం సినిమాలో అర్హ భరతుడి పాత్రను పోషించింది. సమంత, దేవ్ మోహన్ కలిసి నటించిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఉదయం నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న ఈ మూవీలో అర్హ యాక్టింగ్ మాత్రం వేరేలెవల్ అంటున్నారు.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి తెలిసిందే. ఎంతో చురుకైనా చిన్నారి. తన ముద్దు ముద్దు మాటలు.. అల్లరి పనులతో అందరినీ ఆకట్టుకుంటుంది. తల్లిదండ్రులతో.. తన సోదరుడితో కలిసి అర్హ చేసిన అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోస్.. ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. కూతురి పిక్స్.. ఫన్నీ వీడియోస్.. ఇటు బన్నీ.. స్నేహ ఇద్దరూ తమ ఇన్ స్టా ఖాతాలలో షేర్ చేస్తుంటారు. తండ్రితోపాటు.. అర్హకు కూడా భారీ ఫాలోయింగ్ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు అర్హ ఎంత ఫేమస్ అనేది. ఇక ఇప్పుడు చిన్న వయసులోనే వెండితెరపై భరతుడిగా సందడి చేస్తుంది. కేవలం ఆరేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అర్హ. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన అద్భుతమై ప్రేమకథా దృశ్యకావ్యం శాకుంతలం సినిమాలో అర్హ భరతుడి పాత్రను పోషించింది. సమంత, దేవ్ మోహన్ కలిసి నటించిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఉదయం నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న ఈ మూవీలో అర్హ యాక్టింగ్ మాత్రం వేరేలెవల్ అంటున్నారు.
ఈ సినిమాలో అర్హ భరతుడిగా మెప్పించిందని.. ముఖ్యంగా అచ్చ తెలుగులో చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఎంతో సులభంగా చెప్పేసింది. అంతేకాదు.. డైలాగ్ స్పష్టంగా పలుకుతూనే ఎలాంటి భయం లేకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది. దేవ్ మోహన్.. అర్హ మధ్య వచ్చే జరిగి సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేసిందట. స్టార్ హీరో కూతురు చిన్న వయసులోనే ఇంత స్పష్టంగా తెలుగులో డైలాగ్స్ చెప్పడం గ్రేట్ అంటున్నారు ఆడియన్స్. అర్హ.. దేవ్ మోహన్ మధ్య వచ్చే సన్నివేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు బన్నీ అభిమానులు.
కాళిదాసు రచించిన శకుంతల, దుష్యంతుల ప్రేమకథా అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ గుణశేఖర్. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా.. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇందులో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల కీలకపాత్రలలో నటించారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.