Ugram Movie Twitter Review: ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ.. అల్లరోడు హిట్టు అందుకున్నట్టేనా..

|

May 05, 2023 | 6:48 AM

ఈరోజు (మే 5న) ఉగ్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. యూకే, యూఎస్ లో ఉగ్రం సినిమా చూసిన సినీప్రియులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలను చూస్తుంటే.. అల్లరోడు తన ఉగ్రరూపం చూపించినట్లుగా తెలుస్తోంది.

Ugram Movie Twitter Review: ఉగ్రం ట్విట్టర్ రివ్యూ.. అల్లరోడు హిట్టు అందుకున్నట్టేనా..
Ugram movie ott
Follow us on

ఇప్పటివరకు కామెడీ కథా చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్.. ఇప్పుడు పంథా మార్చుకున్నాడు. అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుసగా కామెడీ చిత్రాలు చేస్తూ.. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. పలు చిత్రాల్లో సహాయ పాత్రలలో నటించి మెప్పించారు. నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో… తాజాగా బాక్సాఫీస్ వద్ద తన ఉగ్రరూపం చూపించేస్తున్నాడు. ఈ సినిమాలో ఫోలీస్ అదికారిగా నటించారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా.. మిర్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈరోజు (మే 5న) ఉగ్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. యూకే, యూఎస్ లో ఉగ్రం సినిమా చూసిన సినీప్రియులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలను చూస్తుంటే.. అల్లరోడు తన ఉగ్రరూపం చూపించినట్లుగా తెలుస్తోంది.

ఉగ్రం ఫస్ట్ హాఫ్ మిక్డ్స్ ఎమోషన్లతో కూడిన సినిమా అని.. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, పైట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. అల్లరి నరేష్ నటనకు గూస్ బంప్స్ రావడం ఖాయమంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.