
టాలీవుడ్ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు తాత అయిన ఈదర వెంకట్ రావు సోమవారం (జనవరి 19) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019 మే 27న కన్నుమూశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు పెద్దకుమారుడు E.V.V. సత్యనారాయణ, రెండో కుమారుడు E.V.V. గిరి, మూడో కుమారుడు E.V.V. శ్రీనివాస్, కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ. పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ తెలుగు సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
వెంకట్ రావు పార్తివదేహానికి నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతిపట్ల సినీప్రముఖులు, అభిమానలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ రాజేశ్ సినిమాలకు దూరంగా ఉండగా.. అల్లరి నరేశ్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..