Allari Naresh birthday : తన కామెడీతో గిలిగింతలు పెట్టే అల్లరోడు… ఈ క్రేజీ హీరో

టాలీవుడ్ లో ఉన్న హీరోలందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరో అల్లరికి నరేష్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు నరేష్.

Allari Naresh birthday : తన కామెడీతో గిలిగింతలు పెట్టే అల్లరోడు... ఈ క్రేజీ హీరో

Updated on: Jun 30, 2021 | 8:40 AM

Allari Naresh birthday :

టాలీవుడ్ లో ఉన్న హీరోలందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరో అల్లరికి నరేష్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు నరేష్. టాలీవుడ్‌లో అల్లరోడిగా గుర్తింపు పొంది తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో గిలిగింతలు పెట్టడంలో ముందుటాడు నరేష్‌! టాలీవుడ్‌ హీరోలందరూ.. యాక్షన్‌ డ్రామా సినిమాలు చేస్తుంటే.. మనోడు మాత్రం కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ.. తెలుగు నాట.. విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. మొదటి నుంచి కామెడీ ఎంటర్టైనర్లతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.  నేడు ఈ కామెడీ హీరో పుట్టిన రోజు. రవి బాబు తెరకెక్కించిన అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఆతర్వాత ఆ సినిమా పేరుతోనే అల్లరి నరేష్ గా మారిపోయారు. ఆతర్వాత నరేష్ తండ్రి , దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన సినిమాలతో మంచి గుర్తిపు తెచ్చుకున్నారు. కామెడీ సినిమాలతోనే కాదు గమ్యం నేను వంటి సినిమాల్లో సీరియస్ యాక్టింగ్ తోనూ మెప్పించారు నరేష్. ఇటీవల విడుదలైన నాంది సినిమాతో నరేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు.  ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుని.. 5 సంవత్సరాలు జైల్లో మగ్గుతూ.. చేయని నేరానికి శిక్ష అనుభవించే కుర్రాడిగా అల్లరి నరేష్ నటించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

గతంలో ఇలానే చాలా సినిమాలను నరేష్ వదులుకున్నారని తెలుస్తుంది. ఇప్పడు ఆ పొరపాటు చేయకుండా కథలో బలమున్న సినిమాలను చేయాలనీ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఇప్పటికే 5 కథలను సైతం ఎంపిక చేసుకొని సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. నరేష్ ఇకపై కూడా మంచి సినిమాలను అందిస్తూ సక్సస్ సాధించాలని కోరుకుందాం..

మరిన్ని ఇక్కడ చదవండి :

లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked

Hari Hara Veera Mallu : పవన్ సినిమా కోసం అదిరిపోయే సెట్లు వేస్తున్న డైరెక్టర్ క్రిష్..

Star Hero Son: తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న ఈ అబ్బాయి.. ఓ స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా