
సోషల్ మీడియాలో నిత్యం ఏందో ఒకటి, ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. దీని గురించి తెలియాలంటే ముందు మనం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి.. మీకు అర్ధమయ్యే ఉంటుంది. నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్.. ఎవరు చూసిన అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడం. ఇష్టమొచ్చినట్టు వాగాడంతో ఈ అక్క చెల్లెళ్ళ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
చాలా మంది ఈ చిట్టి పికిల్స్ సిస్టర్స్ ను ట్రోల్ చేశారు. దాంతో వీళ్ల బిజినెస్ క్లోజ్ కూడా అయ్యింది. ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేశారు కూడా.. అయితే ఈ సిస్టర్స్ లో రమ్య అనే అమ్మాయి నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. హాట్ హాట్ గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది రమ్య. అలేఖ్య పికిల్స్ కు రమ్యనే బ్రాండ్ అంబాసిడర్స్.. ఈ అందాల భామ ప్రమోట్ చేసేవరకు చాలా మందికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి తెలియదు.
సోషల్ మీడియాలో తన రీల్స్ తో షేక్ చేస్తున్న రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో మెరిసింది. దాంతో అందరూ మరోసారి ఈ భామను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాల్లో చేశాను అని చెప్పింది. ఇప్పుడు ఏకంగా ఓ ఈవెంట్ లో కనిపించింది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. చిట్టి పికిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేస్తోంది అంటూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.