‘అల’..రికార్డుల వ‌ర‌ద‌..బ‌న్నీ మార్క్ ట్రెండ్ సెట్…

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన‌ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంచ‌ల‌న విజయం సాధించిన విషయం తెలిసిందే. క‌లెక్ష‌న్స్ ప‌రంగా నాన్-బాహుబ‌లి రికార్డ్స్ కొల్ల‌గొట్టిన ఈ మూవీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్ అందించిన‌‌ స్వరాలు ఈ మూవీ రేంజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆల్బమ్ తాజాగా 1 బిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుని యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌ సోషల్‌మీడియా […]

అల..రికార్డుల వ‌ర‌ద‌..బ‌న్నీ మార్క్ ట్రెండ్ సెట్...

Updated on: May 16, 2020 | 4:06 PM

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన‌ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంచ‌ల‌న విజయం సాధించిన విషయం తెలిసిందే. క‌లెక్ష‌న్స్ ప‌రంగా నాన్-బాహుబ‌లి రికార్డ్స్ కొల్ల‌గొట్టిన ఈ మూవీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్ అందించిన‌‌ స్వరాలు ఈ మూవీ రేంజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆల్బమ్ తాజాగా 1 బిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుని యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌ సోషల్‌మీడియా వేదికగా మ్యూజిక్ ల‌వ‌ర్స్ కి స్పెష‌ల్ థ్యాంక్స్ తెల‌పింది.

“మా ఆల్బమ్‌ను ఇంత భారీ రేంజ్ లో హిట్ చేసిన అంద‌రికీ ధన్యవాదాలు. ‘అల.. వైకుంఠపురములో’ ఆల్బమ్‌ యూట్యూబ్‌‌లో 1 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని మ‌రింత ముందుకెళ్తుంది. యాక్ట‌ర్స్, సింగ‌ర్స్, పాటల రచయితలు, ఇతర మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు” అని‌ గీతాఆర్ట్స్‌ ట్వీట్‌ చేసింది.

ఈ సినిమాలోని పాటలకు సెలబ్రిటీలు కూడా మెస్మ‌రైజ్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు టిక్‌టాక్‌ చేసి అద‌రగొట్ట‌గా.. ఇటీవల అలనాటి తార సిమ్రాన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ ‘బుట్టబొమ్ము’ స్టెప్పులతో ఆక‌ట్టుకున్నారు.