Akshay Kumar: శివలింగాన్ని హత్తుకోవడంపై విమర్శలు.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏమన్నారంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటేస్ట్ మూవీ స్కై ఫోర్స్ సూపర్ హిట్ గా నిలిచింది. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవల మహాకాల్ ఛలో పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు అక్షయ్

Akshay Kumar: శివలింగాన్ని హత్తుకోవడంపై విమర్శలు.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏమన్నారంటే?
Akshay Kumar

Updated on: Feb 27, 2025 | 8:29 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ సినిమా ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తద్వారా అక్షయ్ కుమార్ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ ఇటీవల ఓ భక్తి గీతంలో నటించడం వివాదానికి దారి తీసింది.
ఆయన ప్రధాన పాత్రలో కనిపించిన ‘మహాకల్ చలో’ పాటను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. అయితే ఈ పాట చూసిన కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. శివలింగాన్ని హత్తుకోవడంలో తప్పేముంది? అంటూ విమర్శకలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘మహాకల్ చలో’ పాటలో అక్షయ్ కుమార్ శివలింగాన్ని తన్మయత్వంతో హత్తు కుంటాడు. అయితే ఈ పాట చూసిన తర్వాత పూజారుల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాట బాగుంది, కానీ అక్షయ్ కుమార్ శివలింగాన్ని హత్తుకోవడం బాగోలేదని నటుడిపై విమర్శలు చేశారు. అలాగే ఈ పాటలో బూడిదను ఉపయోగించిన పద్ధతి కూడా సరిగా లేదంటూ అక్షయ్ ను విమర్శించారు. తాజాగా వీటన్నింటికీ అక్షయ్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఇటీవల ‘కన్నప్ప’ సినిమా కోసం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ కూడా శివుడి పాత్రలో కనిపించనున్నాడు.

‘చిన్నప్పటి నుంచి దేవుడు అమ్మానాన్నాలతో సమానమని మా పేరెంట్స్ నాకు నేర్పించారు. నేను నా తల్లిదండ్రులను హత్తుకోవడంలో తప్పేంటి? నేను దేవుని నుంచి బలాన్ని పొందుతాను. నా భక్తిని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే, అది నా తప్పు కాదు. నాకు దేవుని పట్ల అపారమైన భక్తి ఉంది’ అని అక్షయ్ కుమార్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల అక్షయ్ కుమార్ మహాకుంభమేళాను సందర్శించారు. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.  45 రోజుల్లో 600 మిలియన్ల మందితో ఇలా ఆధ్యాత్మిక వేడుక నిర్వహించగల దేశం  మరొకటి లేదు. అంతా బాగానే జరుగుతోంది.  మహాకుంభమేళాలో నా అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి