Ichata Vahanamulu Niluparadu Pre Release Event: యంగ్ హీరో అక్కినేని సుశాంత్ ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీకి నో పార్కింగ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాకు ఎస్. దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఏ1 స్టూడియోస్ , శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి- ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు, ట్రైలర్‌కు విశేషస్పందన లభించింది. చాలా కాలం తర్వాత సుశాంత్ సోలో హీరోగా చేస్తున్న సినిమా ఇది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుశాంత్.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అటు సెన్సార్ పనులు కూడా పూర్తిచేసుకుని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సీతారాముల కళ్యాణం, మెగాస్టార్ నటించిన అన్నయ్య మూవీ ఫెమ్ వెంకట్ నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో కనించనున్నాడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈరోజు సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మీరు 7.30 నిమిషాలకు టీవీ9 తెలుగులో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
వీడియో..
Also Read: Sea Level Rise: అంతర్వేదిలో సముద్రం ఉగ్రరూపం.. 45 మీటర్ల మేర ముందుకు.. ఆందోళనలో గ్రామస్థులు
Drugs Case: అవును.. రాగిణి, సంజనాలు డ్రగ్స్ తీసుకున్నారు.. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులో సంచలన విషయాలు.