సీఎం రేవంత్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర సన్నివేశం వెలుగుచూసింది. ముఖ్యమంత్రి రేవంత్‌కు శాలువా కప్పి విష్ చేశారు కింగ్ నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగ చైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత.. వీరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందన్న చర్చ జరిగింది. కానీ తాజాగా మీటింగ్‌లో నవ్వుతూ నాగార్జన.. సీఎంతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వైరల్ అవతున్నాయి.
వీడియో దిగువన చూడండి….
సినీ ప్రముఖులతో భేటీలో కొన్ని కీలక ప్రతిపాదనలు సినీ పరిశ్రమ ముందు ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. కొన్ని నిబంధనలు మినహా పరిశ్రమకు సహకరిస్తాం, మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు సహకారం అందించాలన్నట్లు సూచించింది. దీనికి సంబంధించిన డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం…
సినీ పరిశ్రమ ముందు ఉన్న నాలుగు ప్రతిపాదనలు అంశాల వారీగా చూస్తే..
1. ఇకపై సినిమా టికెట్‌లపై ప్రత్యేక సెస్
— సెస్ ద్వారా వచ్చే నిధులు ఇంటిగ్రేడెట్ స్కూళ్లకు వినియోగం
— సినిమా సెలబ్రిటీలకు అభిమానులుగా ఉన్న వాళ్లలో మెజార్టీ పేద, మధ్య తరగతి ప్రజలు ఉంటారు. వారి పిల్లలు చదువుకునే స్కూళ్లకు ప్రోత్సాహం కోసం ఇప్పుడు ఈ సెస్ వేస్తున్నారు. ఈ సెస్‌ను ఆయా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే వారి కోసం వాడుతారు..
— SC, ST, BC విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే స్కూళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే అందుకు నిధులు అవసరం..
— ఇప్పుడు సినిమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పేదలకు తిరిగి చేరేలా చేసేందుకు.. ఈ సెస్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
2. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌కి టాలీవుడ్ మద్దతివ్వాలి..
— హీరోలు, హీరోయిన్లు అంతా ప్రచారంలో పాల్గొనాలి..
— ఈ అంశాన్ని CM రేవంత్ ప్రధానంగా చెప్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆపరేషన్ చేపట్టింది కాబట్టి .. దానికి ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాలనేది CM మాట..
— సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేయిస్తే అది ప్రజల్లోకి త్వరగా వెళ్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
3. కులగణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలి
— ఇతర ప్రభుత్వ కార్యక్రామాలకు సహకారం ఉండాలి
— కుల గణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి ప్రజోపయోగమైన కార్యక్రమాల విషయంలో ప్రజల్లో అపోహలు తొలిగి అంతా సర్వేకు సహకరించాలి, ముందుకు రావాలంటే అందుకోసం సినీ ప్రముఖుల క్యాంపెయిన్ వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
4. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్‌షోలు లేనట్టే..!
— అసెంబ్లీలో సీఎం మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పనున్న ప్రభుత్వం
— టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయంపై తగ్గేదేలే అన్నట్టుగానే ముందుకు వెళ్లబోతోంది.
— ఇదే విషయాన్ని ఇవాళ్టి మీటింగ్‌లో సినీ ప్రముఖులకు వివరించబోతున్నారు సీఎం..
5. పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానం ప్రతిపాదించిన సీఎం
— తెలంగాణ రైజింగ్‌లో భాగంగా ఇండస్ట్రీ అంతా సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి.
— ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదంటూ స్పష్టమైన మెసేజ్ ఇచ్చిన సీఎం.. ఇండస్ట్రీకి కావాల్సిన రాయితీలపై చర్చిద్దామన్నారు.