Nagarjuna: ఆ విషయంలో నేను సింహాన్నే.. అక్కినేని నాగార్జున సంచలన పోస్ట్.

|

Oct 04, 2024 | 9:51 PM

కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నటుడు నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ

Nagarjuna: ఆ విషయంలో నేను సింహాన్నే.. అక్కినేని నాగార్జున సంచలన పోస్ట్.
Nagarjuna Famly
Follow us on

టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున కుటుంబం గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం మండిపడుతుంది. అటు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నటుడు నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర పోస్ట్ చేశారు. “నేను ఎప్పుడూ బలమైన వ్యక్తిని అని అనుకుంటున్నాను. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో నేను సింహాన్ని. అదృష్టవశాత్తూ తెలుగు పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలబడింది. ఇదంతా మా నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Nagarjuna

కొండ సురేఖ వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన సమయంలో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకుల గురించి సంచలన కామెంట్స్ చేసింది తెలంగాణ మంత్రి కొండా సురేఖ. చైతూ, సామ్ విడిపోవడానికి కారణం కేటీఆర్ అని వ్యాఖ్యలు చేయడంతో సినీ ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండ సురేఖ వ్యాఖ్యలు అటు అక్కినేని కుటుంబంతోపాటు, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, రాజమౌళి, నాగచైతన్య, అఖిల్, సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ ఖండించారు. రాజకీయాల కోసం సినీతారల పేర్లు వాడుకోవద్దని హెచ్చరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.