Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై హీరో అక్కినేని నాగార్జున రెస్పాండ్ అయ్యారు. తనకు ఈ విషయం వారం క్రితమే మెగాస్టార్ చెప్పినట్లు వెల్లడించారు.

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..
Akkineni Nagarjuna

Updated on: Jan 13, 2022 | 2:32 PM

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై హీరో అక్కినేని నాగార్జున రెస్పాండ్ అయ్యారు. ఇండస్ట్రీలోని అందరి కోసమే చిరంజీవి.. జగన్‌తో సమావేశం అవుతున్నారని వెల్లడించారు. బంగార్రాజు సినిమా రిలీజ్ ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని చెప్పారు. జగన్‌తో మీటింగ్ ఉంటుందని వారం క్రితమే చిరంజీవి తనతో చెప్పారని వివరించారు. చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సీఎంతో భేటీ అయిన చిరు…

సీఎం జగన్​తో.. మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మాట్లాడిన చిరంజీవి.. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ బిడ్డగా సీఎంతో మాట్లాడతానన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు చర్చిస్తానని.. భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతానన్నారు. ఏపీలో సినిమా టికెట్ల వివాదం పీక్ స్టేజ్ కి చేరింది. గత కొద్దిరోజులుగా ప్రభత్వానికి, పరిశ్రమ వర్గాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు బాహాటంగానే అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పేదలకు తక్కువ ఖర్చుతో వినోదం అందాలన్నది తమ ఉద్దేశం అని చెబుతోంది. ఇటీవల అయితే కాస్త మీతిమిరి కూడా కామెంట్స్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్​ను కలవటంపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.

Chiru Jagan

Also Read: Telangana: భార్య మరణం.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ఆళి వెంటే భర్త పయనం

Viral Video: ఒక్క సెకన్ గ్యాప్.. లేదంటే నుజ్జునుజ్జయిపోయేవాడు.. షాకింగ్ వీడియో