Bangarraju 18 Days Collection: కరోనా(Coronavirus) వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో.. సంక్రాంతి రేస్ నుంచి బడా సినిమాలు సైడ్ అయ్యాయి. అయినా అక్కినేని హీరోలు నాగ్, చైతూ(Naga Chaitanya) వెనక్కి తగ్గలేదు. తండ్రికొడుకులు కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాను ఫెస్టివల్ స్పెషల్‌గా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అన్న రిపోర్ట్స్ వచ్చాయి. అయితే పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేకపోయినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కోసం అక్కినేని హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వైరస్ భయంతో జనం పండగ సమయంలోనూ థియేటర్లకు దూరంగా ఉన్నారు. ఈ అంశం కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఈ మూవీ విడుదలై సోమవారంతో 18 రోజులు కంప్లీట్ చేసుకుంది. వసూళ్లపై ఓ లుక్ వేద్దాం పదండి.
రెండు తెలుగు స్టేట్స్‌లో 17వ రోజు(సండే) 33 లక్షల రూపాయలు వసూలు చేసిన బంగార్రాజు చిత్రం.. 18వ రోజు 15 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. ఓవరాల్‌గా చూస్తే ఈ 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 34.62 కోట్ల షేర్, 56.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా చూస్తే 37.87 కోట్ల షేర్, 63.65 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ నిపుణుల రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాగా విడుదలకు ముందు 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘బంగార్రాజు’ చిత్రం.. 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ప్రజంట్ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే.. మరో 1.13 కోట్ల షేర్ వసూలు చేస్తేనే ఈ సినిమా పూర్తిగా హిట్ ఖాతాలో చేరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
సోగ్గాడే చిన్ని నాయనా మూవీని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ కురసాల బంగార్రాజు సినిమాను తీశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలక పాత్రల్లో మెప్పించారు. అనూప్ సంగీతానికి మంచి మార్కులు పడ్డాయి.
Also Read: ఎంతో అందంగా శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్.. కానీ అంతలోనే.. వీడియో వైరల్..