కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చిన హీరో..

|

Mar 17, 2021 | 9:25 AM

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయా

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చిన హీరో..
Akkineni Nagarjuna
Follow us on

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్రాలు కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాయి. ఇక కొన్ని ప్రాంతాలలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి కూడా. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రండవ దశ ప్రారంభమైంది. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున మంగళవారం ఫస్ట్‌ డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని, అందుకోసం ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇప్పటికే నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read:

నేచురల్ స్టార్ రంగంలోకి అర్జున్ రెడ్డి.. ‘శ్యామ్ సింగరాయ్’‏లో కీలకపాత్రలో విజయ్ ?

Rana Virata Parvam: విరాటపర్వం టీజర్‌ను ఎవరు విడుదల చేస్తారో తెలుసా? డప్పు కొట్టి మరీ చాటింపు వేసిన చిత్ర యూనిట్‌..