Akkineni Nagarjuna: ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవం.. చై- సామ్ విడాకుల ఇష్యూపై నాగార్జున

నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన నెగెటివ్ వార్తలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే నాగ్ మాట్లాడని కొన్ని మాటలను ఇటీవల ఆయన మాట్లాడినట్లుగా కొందరు సర్కులేట్ చేస్తున్నారు.

Akkineni Nagarjuna:  ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవం.. చై- సామ్ విడాకుల ఇష్యూపై నాగార్జున
Nagarjuna

Updated on: Jan 27, 2022 | 6:38 PM

Samantha- Naga Chaitanya Divorce: సమంత, నాగచైతన్యలు విడాకుల ఇష్యూ సోషల్ మీడియా(Social Media)లో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.  గతేడాది అక్టోబర్‌ 2న తమ డివోర్స్ విషయాన్ని చై- సామ్(Chay-Sam) సోషల్ మీడియా వేదికగా బాహ్య ప్రపంచానికి వెల్లడించారు.  దీంతో ఈ ఇష్యూపై అప్పుడు మొదలైన చర్చలు నేటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ వారు  బయటకు చెప్పలేదు కానీ నెటిజన్లలో ఎన్నో రకాలుగా చర్చలు నడిచాయి. నాలుగేళ్ల వివాహ బంధం తెంచుకోవడం వెనుక రీజన్స్ ఏమై ఉంటాయనే కోణంలో ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి.   తాజాగా చైతూ తండ్రి అక్కినేని నాగార్జున ఈ ఇష్యూపై రెస్పాండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. సమంతనే చైతూ నుంచి మొదట విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతూ ఒప్పుకున్నాడని నాగార్జున అన్నట్లు కథనాలు సర్కులేట్ అయ్యాయి. అయితే ఈ న్యూస్ పై నాగ్ స్పందించారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడాయాలో తాను మాట్లాడినట్టుగా సర్కులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా తప్పుడు వార్తలని కొట్టిపడేశారు. అవి నిరాధారమైనవని పేర్కొన్నారు. వదంతులను వార్తలుగా సర్కులేట్ చేయవద్దని ఆయన మీడియా మిత్రులను కోరారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన నెగెటివ్ వార్తలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: Telangana: అక్కడి పేదలకు గుడ్ న్యూస్.. ప్రారంభోత్సవానికి సిద్దమైన 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లు