డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya), రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ (Thank You). ప్రముఖ నిర్మాత దిల్ రాజు దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో చైతూ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు.
‘‘‘థాంక్యూ’ సినిమా అనేది అభిరామ్ అనే యువకుడి జర్నీ. ఓ యాక్టర్‌గా ఇలాంటి వేరియేషన్స్ చూపించే సినిమా అన్నిసార్లు రాదు. ఇంత మంచి సినిమా చేసిన మా డైరెక్టర్ విక్రమ్, నిర్మాత దిల్‌రాజుగారికి, రైటర్ రవిగారికి థాంక్యూ చెబుతున్నాను. చాలా లేయర్స్‌ను సినిమాలో చూపిస్తున్నాం. అభిరామ్ జీవితంలో వాటిని చక్కగా చూపించాం. లవ్‌స్టోరి, రిలేషన్ షిప్స్, అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య.. ఇలా అన్నింటిని చూపించాం. ఇన్ని వేరియేషన్స్ ఉండటం వల్ల సినిమాలో చాలా స్పాన్ దొరికింది. విజువల్‌గానే కాదు.. మ్యూజికల్‌గా కూడా.
రేపు థియేటర్‌లో సినిమా చూసే ప్రేక్షకుడికి థాంక్యూ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఓ యాక్షన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో అభిమానులు ఎలా హుక్ అవుతారో.. అభిరామ్ జర్నీ స్టార్ట్ కాగానే ఇందులో హుక్ అవుతారు. నేను సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు మన జీవితంలో ఎవరికైనా స్పెషల్ పర్సన్‌కి ఫోన్ చేసి థాంక్యూ చెప్పాలనిపించింది. అదే ఫీలింగ్‌తో ముందుకెళ్లాం. ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఏ జర్నీకైనా మంచి టీమ్ కావాలి. అలాంటి మంచి టీమ్ నాకు దొరికింది.
పాండమిక్ ముందు స్టార్ట్ చేసిన సినిమా పాండమిక్ తర్వాత రిలీజ్ అవుతుంది. దాదాపు మూడు నాలుగేళ్లు అందరం ట్రావెల్ అయ్యాం. చాలా లొకేషన్స్‌లో చేశాం. రాజుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. థాంక్యూ సినిమా ముందు విక్రమ్‌తో నాకు ఒక లాంగ్ జర్నీ ఉంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. పి.సి.శ్రీరామ్‌గారితో కలిసి పని చేయాలనేది నా డ్రీమ్. ఆ కలను రాజుగారు, విక్రమ్ నేరవేర్చారు. రాశీ ఖన్నా లేకపోతే ఈ సినిమా జర్నీనే స్టార్ట్ కాదు. తను మంచి ఫ్రెండ్, కో యాక్టర్. సుశాంత్‌కి థాంక్స్. అడగ్గానే ఒప్పుకున్నందుకు థాంక్స్. జూలై 22న సినిమా రిలీజ్ అవుతుంది” అని అన్నారు చైతూ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.