Naga Chaitanya: ఇది చైతూ గ్యారేజ్.. అక్కినేని అందగాడి కార్, బైక్ కలెక్షన్ చూశారా ..?

|

May 10, 2024 | 5:55 PM

ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీకేయ 2 సినిమా పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో చైతూ సరసన మరోసారి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ ఆకట్టుకున్నాయి. ఇందులో జాలరీ పాత్రలో పూర్తిగా ఢీగ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు చైతూ. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

Naga Chaitanya: ఇది చైతూ గ్యారేజ్.. అక్కినేని అందగాడి కార్, బైక్ కలెక్షన్ చూశారా ..?
Naga Chaitanya
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలలో అక్కినేని నాగచైతన్య స్టేలే వేరు. జోష్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన చైతూ.. ఏమాయ చేసావే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీకేయ 2 సినిమా పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో చైతూ సరసన మరోసారి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ ఆకట్టుకున్నాయి. ఇందులో జాలరీ పాత్రలో పూర్తిగా ఢీగ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు చైతూ. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే చైతూ ఆటోమొబైల్స్ ప్రియుడు. కార్, బైక్ రైడింగ్ అంటే చైతూకు చాలా ఇష్టం. షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని అప్పుడప్పుడు బైక్, కార్ రైడింగ్ కు వెళ్తుంటాడు. అలాగే తనకు ఇష్టమైన అనేక బ్రాండ్స్ కార్, బైక్ కలెక్షన్ కలిగి ఉన్నాడు. చాలాసార్లు హైదరాబాద్ వీధుల్లో తన లగ్జరీ వెహికల్స్‏లో రైడ్ చేస్తూ కనిపిస్తాడు. చైతూ వద్ద ఇప్పటికే ఫెరారీ 488 GTB కారు ఉంది. అలాగే పలు విలాసవంతమైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అలాగే చైతూ గ్యారేజీలో ఉన్న కార్, బైక్ కలెక్షన్ ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాం. 2018లో ఫెరారీ 488 GTB కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ. 3.6 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. అలాగే BMW 740 Li నుండి Mercedes-Benz G-Class G 63 AMG వరకు అనేక కార్లు ఉన్నాయి.

నాగ చైతన్య బైక్, కార్ కలెక్షన్..

  • ఫెరారీ 488GTB — (రూ. 3 నుండి 4cr)
  • BMW 740 Li — (రూ. 1.30cr)
  • 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
  • Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
  • MV అగస్టా F4 — (రూ. 30లీ)
  • BMW 9RT — (రూ. 19 నుండి 24L)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.