Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రేమమ్ సినిమా నుంచి చైతన్య కథల సెలక్షన్ లో చాలా చేంజెస్ వచ్చాయి. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు చైతన్య. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి హిట్ సొంతం చేసుకోవడంతోపాటు నాగ చైతన్య నటనను చాలా ఇంప్రూవ్ చేసింది. తెలంగాణ కుర్రాడిగా యాసతో పర్ఫామెన్స్ తో కట్టిపడేసాడు యువ సామ్రాట్. ఈ సినిమా తర్వాత నాన్న నాగార్జునతో కలిసి బంగార్రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడంలో సక్సెస్ అయ్యింది.
ఈ జోష్ లోనే ఇప్పుడు థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు చై.. అక్కినేని ఫ్యామిలీకి చిరకాలం గుర్తుండిపోయే మనం సినిమా ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇదిలా ఉంటే సినిమాలతోపాటు బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు చైతు. హైదరాబాద్‌లో `షోయూ` అనే ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. క్లౌడ్ కిచెన్ విధానంలో ఇది పనిచేస్తుంది. అత్యుత్తమ ఆసియా వంటకాలన్ని ఇక్కడ మీకు దొరుకుతాయి అంటూ చైతన్య హైదరాబాద్ ప్రజలకు కొత్త వంటకాల్ని పరిచయం చేస్తున్నారు. త్వరలోనే రెస్టారెంట్‌ను విస్తరించనున్నారట. రెస్టారెంట్ రంగంలో స్థిరపడితే తర్వాత బిజినెస్‌లపై పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు చైతూ..
మరిన్ని ఇక్కడ చదవండి :