Valimai: సంక్రాంతికి బరిలో అజిత్ ‘వాలిమై’.. జనవరి 13న విడుదల.!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ హీరోగా నటించిన చిత్రం ‘వలిమై’. ఈ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించారు....

Valimai: సంక్రాంతికి బరిలో అజిత్ వాలిమై.. జనవరి 13న విడుదల.!
Ajith

Edited By: Ravi Kiran

Updated on: Jan 06, 2022 | 7:10 AM

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు  హీరోగా నటించిన చిత్రం ‘వాలిమై’. ఈ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల అవుతుంది. ఈ మేరకు తెలుగు టైటిల్‌తో కూడిన విడుదల తేదీ పోస్టర్‌ను నాగచైతన్య సోషల్ మీడియాలో విడుదల చేశారు.

‘‘నేను అజిత్‌ సర్‌కి పెద్ద అభిమానిని. ఆయన సినిమా పోస్టర్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది’’ అని చైతు చెప్పుకొచ్చారు. సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్‌లో అజిత్‌ తుపాకీ పట్టుకుని సీరియస్‌గా కనిపించారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాని జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించారు. ఇదిలా ఉంటే కొందరు కరోనా, ఒమిక్రాన్ టెన్షన్ కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి చిత్ర యూనిట్ దీనిపై ఏమైనా స్పందిస్తారా.? లేదా.? అనేది చూడాల్సి ఉంది.

Read Also.. Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..