Ajith :తమిళ్ స్టార్ హీరో అజిత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అజిత్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడకూడా మంచి వసూళ్లను సొంతం చేసుకుంటుంటాయి. అజిత్ ప్రస్తుతం వలిమై అనే సినిమా చేస్తున్నాడు. ఇక వాలిమై మేనియాతో అజిత్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. కోలీవుడ్, నేషనల్ స్థాయిలోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు. అప్ డేట్స్ కావాలంటూ.. ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్స్ వేదికగా అడిగేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా.. వాలిమై కోసం ఫ్యాన్స్ హంగామా.. పీక్ స్టేజ్ కు చేరుకుంది. మొన్నటివరకు ఆర్ఆర్ఆర్ , పుష్ప, బీస్ట్ అంటూ సోషల్ మీడియాలో నడిచిన హంగామా కంప్లీట్ కాకముందే.. అజిత్ ఫ్యాన్స్ ఓ లెవెల్లో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరిగిన సౌథాంప్టన్ వేదికగా ఫ్యాన్స్ చేసిన హంగామా ఇంకా మర్చేపోలేదు. ప్రాక్టీస్ సెషన్స్ లో వాలిమై అప్ డేట్స్ కావాంలటూ.. పోస్టర్లు ప్రదర్శించారు.
హెచ్ వినోద్ డైరెక్షన్ లో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. వాలిమై. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇంతవరకు ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదంటూ.. సోషల్ మీడియాలో అభిమానులు ఓ లెవెల్లో హంగామా సృష్టిస్తున్నారు. ఇందులో అజిత్ ఈశ్వర మూర్తి అనే సీబీసీఐడీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే రేసర్ గా కూడా అజిత్ కనిపిస్తాడని చెబుతున్నారు. దీంతో ఫస్ట్ లుక్ ఇప్పుడే రివీల్ చేయాలంటూ ప్రెషర్ పెడుతున్నారు. దీంతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఎవైటెడ్ ఫస్ట్ లుక్ లిస్ట్ లో.. వాలిమై కూడా చేరిపోయింది. దీంతో వాలిమై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటు వాలిమై డైరెక్టర్ వినోద్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే అజిత్ ప్రకటించాడు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ మూవీస్ చేసిన అజిత్.. తాజాగా వినోద్ కాంబినేషన్ లో కూడా మూడో మూవీ ప్రకటించాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :