Vidaamuyarchi: అజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే పనిలో మేకర్స్.. త్వరలోనే క్రేజీ అప్డేట్

|

Jan 04, 2025 | 10:56 AM

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన విదాముయార్చి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. కానీ ఇప్పుడీ సినిమా కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా ఈ చిత్రాన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Vidaamuyarchi: అజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే పనిలో మేకర్స్.. త్వరలోనే క్రేజీ అప్డేట్
Ajith
Follow us on

అజిత్ ఫ్యాన్స్ ప్రస్తుతం కోపంతో ఊగిపోతున్నారు. అజిత్ లేటెస్ట్ మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఫ్యాన్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అజిత్ ప్రస్తుతం విదాముయార్చి సినిమా చేస్తున్నాడు. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమా షూటింగ్ 2023లో ప్రారంభం కాగా, సినిమా ఇంకా విడుదల కాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు, షాక్‌కు గురి చేసింది. ఇంతకుముందు అజిత్ నటించిన సినిమా విడుదలైన తర్వాత అభిమానులలో అసంతృప్తిని నెలకొంది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు విదాముయార్చి పై భారీ అంచనాలు నెలకొంది.  లైకా నిర్మించిన ఈ చిత్రంలో అజిత్, త్రిష తోపాటు అర్జున్, ఆరవ్, రెజీనా, ప్రియా భవానీ శంకర్, అర్జున్ దాస్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది కూడా చదవండి : దిమ్మతిరిగింది సామి..! ఈ టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్స్.. ప్రభాస్ ఫ్రెండ్ సిస్టర్సా..!!

2023లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. మధ్యలో, నటుడు అజిత్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో జతకట్టాడు. ఈ సినిమా రన్నింగ్ లో ఉండగానే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించడం ప్రారంభించాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ వాయిదా పడింది.

ఇది కూడా చదవండి : Kanchana 4: దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ.. కాంచన 4లో ఆ క్రేజీ భామ

కాగా చిత్ర బృందం నవంబర్ 28న విదాముయార్చి సినిమా టీజర్‌ను విడుదల చేసింది. అలాగే ఈ చిత్రాన్ని పొంగల్ పండుగకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. జనవరి 1వ తేదీ అర్థరాత్రి 12.07 గంటలకు  ట్రైలర్‌ను విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. కానీ ఆతర్వాత ట్రైలర్ రిలీజ్ చేయడం లేదు అని అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అజిత్ అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థ లైకాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా పేజీలో పోస్ట్‌లు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోపాన్ని చల్లార్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. కోలీవుడ్ టాక్ ప్రకారం చిత్ర బృందం విదాముయార్చి ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి