
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మేయిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజైంది. అజిత్ మేనియాతో ఈ సినిమాకు బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు కూడా ఆడియెన్స్ ను అలరించాయి. అయితే ఎందుకోగానీ అజిత్ సినిమా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. దీంతో యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అజిత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా పట్టుదల సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ వచ్చింది. మార్చి 3 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరక సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.
తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అజిత్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా బ్రేక్‍డౌన్ అనే హాలీవుడ్ సినిమా కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మేయిళ్ తిరుమేని. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అరవ్, నిఖిల్ సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవ రవి, గణేశ్ శరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Muyarchi thiruvinai aakum. Vidaamuyarchi ulagai vellum 💪🔥
Watch Vidaamuyarchi on Netflix, out 3 March in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/21OiHpF8AB— Netflix India South (@Netflix_INSouth) February 24, 2025
ఇక పట్టుదల సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్ బైజాన్‌లో నివాసముంటారు. మనస్పర్థల కారణంగా విడిపోదామని ఇద్దరూ నిర్ణయం తీసుకుంటారు. అయితే విడిపోయే ముందు ఇద్దరూ కలిసి రోడ్ ట్రిప్ వెళతారు. అయితే ఈ ప్రయాణంలో త్రిష కనిపించకుండాపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.