AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్.. విష్ణు ప్రియ, అనన్య బాటలో మరో బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్

మొన్న విష్ణు ప్రియ.. నిన్న అనన్య నాగళ్ల.. ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీ ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్.. విష్ణు ప్రియ, అనన్య బాటలో మరో బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Apr 22, 2026 | 6:17 PM

Share

ఇటీవల కాలంలో ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అంటూ సెలబ్రిటీలు తెగ హంగామా చేస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అంటూ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ భారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇటీవల విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల ఈ జాబితాలో చేరారు. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో చేరిందని తెలుస్తోంది. ‘అందరూ సబ్ స్క్రైబ్ చేసుకోండి.. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. వీడియోలు’ అని నవ్వుతూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే అషూ రెడ్డి నిజంగానే ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. టిక్ టాక్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన అషూ రెడ్డి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతోనూ బాగా పాపులర్ అయ్యింది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో తీసిన బోల్డ్ ఇంటర్వ్యూ తో కూడా బాగా వైరల్ అయ్యింది. ఆ మధ్యన కొన్ని సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోంది.

ఇక అషూరెడ్డికి సోషల్ మీడియాలోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ ఇందులో షేర్ చేస్తుంటుంది. అలాగే గ్లామరస్ ఫొటోస్, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తుంటాయి. ఒక వేళ ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ కనుక పెడితే భారీ స్థాయిలో ఫాలోవర్లు పెరుగుతారని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే విష్ణు ప్రియ విషయానికి వస్తే.. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ కు ముందు ఆమెకు చాలా తక్కువ మంది సబ్ స్క్రైబర్లు ఉండే వారు. ఎప్పుడైతే కేసు నమోదు అయ్యిందే ఒక్కసారిగా అషూరెడ్డి సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు అషూ రెడ్డి విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ న్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

అషూ రెడ్డి షేర్ చేసిన వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us