Actor Dhanush: విజయ్ బాటలో ధనుష్.. ఖరీదైన కారు కొన్నా టాక్స్ మినహాయింపు ఇవ్వండి అంటూ కోర్టు మెట్లు ఎక్కిన హీరో

|

Aug 05, 2021 | 1:23 PM

Actor Dhanush: కోట్లకు కోట్లు రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుని లగ్జరీ లైఫ్ ను అనుభవించే సినీ సెలబ్రెటీలు కొందరు వివాదాస్పద ప్రవర్తనలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.. ఇప్పటికే కొత్త కారు కొనుకున్నా టాక్స్..

Actor Dhanush: విజయ్ బాటలో ధనుష్.. ఖరీదైన కారు కొన్నా టాక్స్ మినహాయింపు ఇవ్వండి అంటూ కోర్టు మెట్లు ఎక్కిన హీరో
Hero Dhanush
Follow us on

Actor Dhanush: కోట్లకు కోట్లు రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుని లగ్జరీ లైఫ్ ను అనుభవించే సినీ సెలబ్రెటీలు కొందరు వివాదాస్పద ప్రవర్తనలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.. ఇప్పటికే కొత్త కారు కొనుకున్నా టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోలీవుడ్ స్టార్ విజయ్ కోర్టు మెట్లు ఎక్కగా.. తాజాగా ఇప్పుడు సహజ నటుడు ధనుష్ వంతు వచ్చింది. తాను కొన్న కొత్త కారుకి దిగుమతి రద్దు చేయాలనీ ధనుష్ కోర్టు మెట్లు ఎక్కాడు. దీంతో హీరో ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ధనుష్ రోల్స్ రాయల్స్ కారు కొనుగోలు చేసిన విషయంలో దిగుమతి టాక్స్ రద్దు చేయాలనీ కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాన్య మానవుడు ఒక సోపు కొన్నా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు.. ఇక కోట్లు సంపాదించే సినీ నటుడు ఎందుకు టాక్స్ పే చేయరని ప్రశ్నించింది. అంతేకాదు.. ఎంత ఖరీదైన కారు కొన్నా రోడ్డుమీదనేగా నడిపేది.. ఆకాశం లో కాదు అంటూ వ్యాఖ్యానించింది.

మధ్యతరగతి ప్రజలు మీలాగే టాక్స్ లనుండి మినహాయింపు కోరుతున్నారా… వీఐపీ హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రం ఎందుకు టాక్స్ మినహాయింపు విషయాలలో కోర్ట్ ని ఆశ్రయిస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇటువంటి పిటిషన్ వేయమని క్లయింట్ అడిగినప్పుడు న్యాయవాదులు .. పిటిషనర్ కి టాక్స్ ఎందుకు పే చేయాలో వివరించాల్సిన బాధ్యత లేదా అని జడ్జి ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కారుకి టాక్స్ మినహాయింపు కోరుతూ నటుడు విజయ్ హైకోర్టు ని ఆశ్రయించగా జడ్జి ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు జలకళ .. మొదలైన పర్యాటకుల సందడి.. ఊరిస్తున్న చేపల వంటకాలు